తెలంగాణవీణ జాతీయం : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరో బైక్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. బైక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న గెరిల్లా 450ని (Guerrilla 450) ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.39 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మూడు వేరియంట్లు, ఐదు రకాల కలర్ ఆప్షన్లతో వస్తున్న ఈ మోటార్ సైకిల్ విక్రయాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి.ఇక ఈ మోటార్ సైకిల్ వివరాల్లోకి వెళితే.. గెరిల్లా 450లో 452 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజిన్ అమర్చారు. ఇది 39.4 బీహెచ్‌పీని, 40Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ ఆప్షన్‌తో వస్తోంది. పెర్ఫార్మెన్స్, ఎకో రైడ్ మోడ్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్‌లో సింపుల్ డిజిటల్ అనలాగ్ ఇచ్చారు. టాప్ మోడల్‌లో 4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో మ్యూజిక్ ప్లే చేయొచ్చు. మెసేజ్ అలర్ట్‌లు పొందొచ్చు.ఈ మోటార్ సైకిల్.. ఫ్లాష్, డ్యాష్, అనలాగ్ వేరియంట్లలో వస్తోంది. హిమాలయన్ మోడల్‌లానే రౌండ్ హెడ్‌ల్యాంప్‌తో వస్తోంది. ముందూ వెనుక స్ప్లిట్ సైడ్ ఇండికేటర్లు అమర్చారు. 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తున్న ఈ మోటార్ సైకిల్‌లో.. ముందువైపు 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్ ఇచ్చారు. వెనుక వైపు 140 ఎంఎం, లింకేజ్ టైప్ మోనోషాక్ అమర్చారు. అలాయ్ వీల్స్, అన్ని రకాల రోడ్లపైనా ప్రయాణించేందుకు వీలుగా సియట్‌తో ప్రత్యేకంగా తయారు చేయించిన ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. అనలాగ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.39 లక్షలు కాగా.. డ్యాష్ వేరియంట్ రూ.2.49 లక్షలు, ఫ్లాష్ వేరియంట్ రూ.2.54 లక్షలకు లభిస్తుంది.