తెలంగాణవీణ, సినిమా : ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల క్లబ్లో చేరింది. ప్రస్తుతం థియేటర్లో ‘కల్కి’ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే, ‘కల్కి’ ఓటీటీలో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. థియేటర్లో విడుదలై 10 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయనున్నారు. అంటే సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఓటీటీ వేదికతో ఒప్పందం జరిగినట్లు చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే.కొనసాగుతున్న ‘కల్కి’ వసూళ్ల హవా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర చిత్రాలు లేకపోవడంతో ‘కల్కి’ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో థియేటర్లో సినిమా చూడాలనుకునే వారికి ‘కల్కి’ మంచి ఆప్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇప్పటికీ పలు థియేటర్లో ‘కల్కి’ చక్కటి వసూళ్లను రాబడుతున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటగా, భారత్‌లో రూ.584 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఇప్పటికే ‘యానిమల్’ (553.87 కోట్లు) వసూళ్లను దాటగా, షారుఖ్‌ఖాన్ ‘జవాన్’ (రూ.640.25 కోట్లు) రికార్డును బద్దలు కొట్టే దిశగా వెళ్తోంది. ఇక ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (రూ.1030.42 కోట్లు) ఇప్పటికీ టాప్‌లోనే ఉండటం గమనార్హం. మరోవైపు బుకింగ్స్‌లోనూ ‘కల్కి’ హవా కొనసాగుతోంది. బుక్‌మై షోలో 10 మిలియన్ల టికెట్లు విక్రయమైన చిత్రంగా ‘జవాన్’ పేరిట రికార్డు ఉండగా తాజాగా దాన్ని అధిగమించింది. ‘కల్కి’కి ఇప్పటివరకూ 12 మిలియన్ల టికెట్ల విక్రయమైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.