తెలంగాణవీణ హైదరాబాద్ : లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీనటుడు రాజ్‌తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు. ఈనెల 18లోపు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు.రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నటి మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక తనను రాజ్ దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విషయమై ప్రశ్నిస్తే రాజ్ దుర్భాషలాడాడని ఆమె తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్ తరుణ్‌తోపాటు మాల్వీ, మయాంక్‌లపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ‘రాజ్ లేనిదే నేను బతకలేను. అన్నీ కోల్పోయా. నేను మోసపోయా. రాజ్ నా చావును కోరుకున్నాడు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ తన అడ్వకేట్‌కు లావణ్య సందేశం పంపగా.. పోలీసులు కౌన్సెలింగ్ చేశారు.