తెలంగాణవీణ , హైదరాబాద్: డ్రగ్స్ విక్రయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్‌తోపాటు, రెండు పాస్‌పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులను సీజ్ చేశామన్నారు. నిందితులను ఒనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీం, వెంక గౌతమ్, వరుణ్ కుమార్, మహ్మద్ షరీఫ్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. ఈ ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు.