తెలంగాణవీణ, హైదరాబాద్ :మేజర్ ప్రైవేట్ కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను పెంచేశాయి. HDFC లైఫ్, ICICI ప్రూడెన్షియల్, బజాజ్ అలియాంజ్, మాక్స్ లైఫ్, టాటా AIA లాంటి కంపెనీలు 10 శాతం వరకు పెంచాయి. ద్రవ్యోల్బణం, రిస్క్ కవరేజి ఎక్కువగా ఉండే టైర్-2, 3 సిటీలలో డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అయితే LIC, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియాన్ని పెంచే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి