టాలీవుడ్ రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న లావణ్య ఇవాళ మరోసారి మీడియాతో మాట్లాడింది. తాను, రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్‌లో ఉన్నట్లు తెలిపింది. తాను, రాజ్ తరుణ్ గుడిలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు వచ్చిన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కోసం తనను రాజ్ తరుణ్ దగ్గరకు రానివ్వడం లేదని చెప్పింది.
రాజ్ తరుణ్, మాల్వీ చెన్నైలోని ఓ హోటల్లోనూ ఉన్నారని తెలిపింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. డబ్బుల కోసమే అయితే తాను రాజ్ తరుణ్ తో పదేళ్లు ఎందుకు కలిసి ఉంటానని అడిగింది. తనకు, మస్తాన్ సాయికి గొడవ జరిగిందని లావణ్య తెలిపింది.
తనతో కొందరు మైండ్ గేమ్ ఆడినట్లు ఆరోపించింది. అందులో తాను, మస్తాన్ బాధితులమయ్యామని చెప్పింది. అలాగే, మాదక ద్రవ్యాల కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపింది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని చెప్పింది. అతడికి చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించింది.
తాను, మస్తాన్ సాయి ఎన్నడూ జంటగానూ కనిపించలేదని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ అతడికే మద్దతు పలుకుతున్నారని చెప్పింది. కాగా, రాజ్ తరుణ్ కేసులో పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసుల నోటీసులకు ఆమె స్పందించలేదని తెలుస్తోంది.