తెలంగాణవీణ, గజ్వేల్ : గజ్వేల్ – ప్రజ్ఞపూర్కు చెందిన శ్రావణ్(18) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టారు.ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న శ్రావణ్ ఎగిరి డివైడర్‌పై పడడంతో తలకు బలమైన గాయాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.