కాంగ్రెస్ పరిపాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట : ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి
తెలంగాణ వీణ, మేడ్చల్ : ప్రజా సంక్షేమనికి కాంగ్రెస్ ప్రభత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల సందర్శించి అభివృద్ధి పనులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం పాఠశాలల మరమ్మత్తులకు చిల్లి గవ్వ కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో పాఠశాలల నిర్వహణ అధ్వానంగా తయారయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులైన త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ సదుపాయం బిల్డింగ్ మరమ్మత్తులు వీటన్నింటికీ అమ్మ ఆదర్శ పాఠశాల భాగంగా యుద్ద ప్రాతిపదికన నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కేశవరం ఉన్నత పాఠశాలకు 9 లక్షలు ప్రాథమిక పాఠశాలకు లక్ష యాభై వేల రూపాయలు జిల్లాకలెక్టర్ ఎస్డీఎఫ్ నిధుల నుండి మంజూరు చేయించి మరమ్మతులు వీర్వహిస్తున్నారని తెలిపారు. మరమ్మత్తులను పాఠశాల తొందరగా పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారను ఆదేశించడం జరిగిందన్నారు.