- రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై జిల్లా కలెక్టరేట్లో మంత్రులు సీతక్క- కొండా సురేఖ రివ్యూ..
- హాజరైన వరంగల్.. హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారదాదేవి- ప్రావిణ్యా రెడ్డి- ఇతర అధికారులు..
- గ్రేటర్ వరంగల్ లో చేపట్టనున్న అభివృద్ది పనులపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులుతెలంగాణవీణ తెలంగాణ:రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎంకు నివేదించనున్న పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వన మహోత్సవం, మహిళా శక్తి కార్యక్రమం తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.