బెడ్ షీట్స్ లేవు.. చేర్చుకోవడం కుదరదు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ షీట్స్ లేవు అని ఐపీ సేవలు నిలిపివేసిన ఆసుపత్రి సిబ్బంది. జిల్లాల నుండి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఇబ్బందులకు గురవుతున్న రోగులు. ఐపీ సేవలు నిలిపివేయడంతో ఆపరేషన్లు, సర్జరీల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులను బెడ్ షీట్లు లేవు అనే సాకుతో సిబ్బంది అడ్డ్మిట్ చేసుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక దిక్కుతోచని పరిస్థితిలో రోగులు సతమతమవుతున్నారు.