- కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న మాజీ సీఎం
- జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్
- జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ తెలంగాణ వీణా తెలంగాణ:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని..జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికాలను ప్రతివాదులుగా చేర్చారు.