తెలంగాణ వీణా కొంపల్లి:కొంపల్లి లోని శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్స్ లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్ 7 వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి నిన్ననే హాస్టల్లో చేరాడు. ఈరోజు ఉదయం శవమైకనిపించాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్ర పోయిన విద్యార్థి.. ఉదయం నిద్ర లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్ వార్డన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు