తెలంగాణ వీణ హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై హై కమాండ్ తో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరే అవకాశాలు ఉన్నాయి.