తెలంగాణవీణ, ఏపీ బ్యూరో : పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ట్విట్టర్(ఎక్స్)లో వైసీపీ తిప్పికొట్టింది. “మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా?. హైదరాబాద్లో పాతికేళ్ల క్రితం ఎన్టీఆర్ భవన్కి ఇలానే స్థలాన్ని కేటాయించుకున్న విషయం మీ చంద్రబాబు మర్చిపోయాడా? అదే పని వైయస్ఆర్సీపీ చేస్తే కబ్జా అంటూ టీడీపీ, ఎల్లో మీడియాలో రెండు రోజులుగా ఈ కపట నాటకాలెందుకు?” అని ట్వీట్ చేసింది.