తెలంగాణవీణ, హైదరాబాద్ : కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి కీలక నేత వెళ్లేందుకు సిద్ధం అయ్యారట. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంతుపట్టడం లేదు.ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీల వైపు మొగ్గు చూపుతుండగా…. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత నామా నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నట్టు సమాచారం.తాజాగా బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న నామా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే తరునంలోనే…టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుందని బాంబ్ పేల్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుందని చరిత్రలో రాసుకోవాల్సిందేనని,BRS కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. హరీష్ రావు, కెసిఅర్ ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తానని… బయ్యారం, ఖాజీపేట కొచ్ ఫ్యాక్టరీకి ఫీజుబిలిటీ లేదు.. ఫాజిబులిటీ లేదని ఎక్సపెర్ట్ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.