తెలంగాణ వీణ/ఓయూ: ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో…కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా నీట్అభ్యర్థుల సమస్యలు పరిష్కారం కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొని మాట్లాడుతూ వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాలు సమాజం మీద ఉన్న అవగాహన మరి ఎవరికీ లేదని, సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి తను చేసిన భారత్ జోడో యాత్ర మరియు న్యాయ యాత్ర తో తను ఈ సమాజంలో ఉన్న నిరుద్యోగ సమస్య పేదరికం పోగొట్టడానికి తను ఎంతో శ్రమించాడు మరియు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు భిన్నభిప్రాయాలు మత విద్వేషాలు ఈ దేశానికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య అని భావించి తాను సమాజాన్ని ఏకం చేయనీకి తాను చేసిన పోరాటం రేపటి భవిష్యత్ కీ ఒక మార్గ దర్శకం అన్ని చెప్పుకొచ్చారు రేపటి దేశ భవిష్యత్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర చందనారెడ్డి ఉపాధ్యక్షురాలు, అభిజిత్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీకర్, ఓయూ ఇంచార్జ్ వికాస్ వర్కింగ్ ప్రెసిడెంట్,వంశీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ ముదిరాజ్ వైస్ప్రె సిడెంట్ సాయి ఓంకార్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ జనరల్ సెక్రెటరీ వినయ్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ మరియు ఓయూ ఎన్ ఎస్ యు ఐ కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు భారీగా పాల్గొని సంతకాలు చేసి నీట్ అభ్యర్థుల సమస్య పరిష్కారం కావాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.