తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10 వేల మందితో సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.ఈ గిరిప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై బోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ కొనసాగించారు.గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు.