తెలంగాణవీణ, కోదాడ : కోదాడ బస్సు స్టాండు నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్టాండులో గంటల తరబడి వేచి ఉన్న బస్సులు రాకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు వేరే బస్సులు స్టాండులోకి రాకుండా ఆందోళన చేశారు. బస్సుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటూ అధికారులను నిలదీసి.. అవసరమైతే మీకు డబ్బులు చెల్లిస్తాం.. బస్సులు పంపించండి అని ఆవేదన వ్యక్తం చేశారు.