హైదరాబాద్ నగరం నడిబొడ్డున మైనర్ బాలిక మీద ఘోరం
12 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్త కుప్పలో పడేయగా పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
బాలిక తప్పిపోయి వారం రోజులైనా పోలీసుల నిర్యక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉంటున్నారు.
ఈనెల 7న వారి పెద్ద కుమార్తె (12) కిరాణా షాపు వద్దకి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చుట్టుపక్కల ప్రాంతాలు వెతకగా చివరికి వారం రోజుల తరువాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యం.
పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని.. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కదని రోదిస్తున్న బాలిక తల్లితండ్రులు.