తెలంగాణ వీణా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్:ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావడం, సిగ్నల్స్‌లో సమస్య తలెత్తడం తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ రైలు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారు. తాజాగా కోల్‌కతాలో ఓ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.ప్రారంభంలో సీల్దా-బౌండ్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ న్యూ జల్‌పైగురి స్టేషన్ నుండి బయలుదేరింది. రైలు రంగపాణి ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా సరుకు గూడ్స్ రైలును ఢీకొనడంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు బోల్తాపడ్డాయి. రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.