తెలంగాణవీణ – కూకట్ పల్లి… కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ వెంచర్ 2లోని 630 ఎల్ఐజి ఫ్లాట్స్ పై పెంచిన 63 శాతం, ఫైనల్ కాస్ట్ ను రద్దుచేసి వెంటనే, ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ, ఈ మేరకు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ , కి ఆదివారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫోర్త్ ఫేస్ వెంచర్ టు లో, హౌసింగ్ బోర్డు వారు 630 ఎల్ఐజి ఫ్లాట్స్ ను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు, అయితే వీటి ఫైనల్ కాస్ట్ 63శాతం గా నిర్ణయించడంతో, ఇంతవరకు ఇవి రిజిస్ట్రేషన్ కాలేదు. అయితే ఈ పెంచిన ధరను తగ్గించి, తాత్కాలిక ధరకే రిజిస్ట్రేషన్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు, దీనిపై గత ప్రభుత్వంలోనూ ఇక్కడి లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉందనీ, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఇన్చార్జి బండి రమేష్ ని లబ్ధిదారులు కలిశారు, దీంతోపాటు వెంచర్ ప్రారంభంలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హౌసింగ్ బోర్డ్ హామీ ఇచ్చిందని, అది ఇప్పటి వరకు నెరవేరలేదని, దీనిపై కూడా చర్య తీసుకోవాలని వారు కోరారు. అసోసియేషన్ ప్రతినిధులు పెద్దిరాజు, రవిచావా, శరత్ బాబు, సూరిబాబు ,నిరంజన్ రెడ్డి, సుధీర్, మహేశ్వరరావు, తదితరులు ఉన్నారు.