తెలంగాణ వీణ, మేడ్చల్ : బిఆర్ఎస్ నేతలు బిజేపి బాట పట్టారు.ఒకరికి ఒకరు తోడై బిజేపి లో చేరుతున్నారు. శనివారం బిఆర్ఎస్ ఎస్స్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడేం కుమార్, మాజీ వార్డు సభ్యుడు గణేష్ మరో 20 మంది తో కలసి బిజేపి లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అలియాబాద్ బిఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ బిజేపి పార్టీ లో చేరగా ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.దీంతో అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పని ఐపోయిందని గ్రామంలో చర్చ మొదలయింది.బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లేక పోవడంతోనే పార్టీ రోజు రోజుకు చతికిల పడుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షుడు కైర యాదగిరి, అల్లం శ్రీనివాస్, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.