తెలంగాణ వీణ / కంటోన్మెంట్ : టోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ న్యూ బోయిన్‌పల్లి లో ని పెన్షన్ లేన్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తో కలిసి శుక్రవారం పర్యటించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఒకటో వార్డు నుండి మూడువేల కు పైగా మెజారిటీ అందజేశారని నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని శ్రీ గణేష్ అన్నారు. ఈ సందర్భంగా మొదట గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముస్లిం ప్రతినిధుల తో సమస్యల పై చర్చించారు. న్యూ బోయిన్ పల్లి ముస్లిం బోర్డు కమిటీ ప్రతినిధులు పెండింగ్‌లో ఉన్న సమస్యల గురించి ముఖ్యంగా జామియా మసీదు సమీపంలోని రహదారిని మూసివేయడం, ఫైజాన్ హైస్కూల్ , గ్రేవ్ యార్డ్ సమస్య గురించి శ్రీ గణేష్ కు వివరించారు. అనంతరం శ్రీ గణేష్ మాట్లాడుతూ సి.ఎం రేవంత్ రెడ్డి సహకారంతో వివిధ వర్గాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని అంకిత భావం తో సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఫైజాన్ స్కూల్, గ్రేవ్ యార్డ్ సమస్య విషయంలో సి ఎం రేవంత్ రెడ్డి కి అవగాహన ఉందని ,ఎంపి గా ఉన్న సమయంలో పర్యటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, ముప్పిడి మధుకర్, ప్రభుగుప్త, షకీబ్ హుస్సేన్,చోటు, మౌలా,వర ముస్లీమ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.