తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట : ఆలేరు పట్టణంలో పర్యటిస్తా పారిశుద్ధ్య పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అన్నారు.శుక్రవారం రోజు ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు.బీర్ల ఐలయ్య తో పాటు ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో అందరూ అధికారులు పాల్గొనాలని తెలిపారు.పారిశుద్ధ్య పనుల్లో భాగంగా,చెత్తను ఆలేరు పెద్ద వాగులో వేయకుండా,డంపింగ్ యార్డ్ ను వాడలన్నారు.అలేరు మున్సిపాలిటీ లో టాక్స్ చెల్లిస్తున్నారా అని ఆడిగి తేలుసుకున్నారూ.పట్టణంలో నూతన నిర్మాణలను ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయో పూర్తి సమాచారం మున్సిలల్ అధికారుల వద్ద ఉండాలన్నారు.అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు అందజేసి చర్యలు చేపట్టాలన్నారు.ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.అలేరు పట్టణంలో ఈ నెల 18-20తేదీల్లో అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామన్నారు..