తెలంగాణ వీణ/నాచారం: నువ్విచ్చే రక్తం మరొకరి జీవితం ఒకరి దానం ఒకరి ప్రాణం రక్తదానం చేయండి
ప్రాణదాతలు కండి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి లో రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రక్తదానం యొక్క ప్రాముఖ్యత ప్రాణాలను కోల్పోయిన వేలాది మంది జీవితాలను కాపాడడమే కాదు,అనేక వ్యాధుల బారిన పడిన మరెంతో మంది ప్రాణాలను కాపాడటానికి మరియు అనేక వ్యాధులతో పోరాడటానికి వారికి సహాయం చేస్తుంది.ప్రజలు తమ రక్తాన్ని దానం చేసినప్పుడు,వారు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందారని కూడా గమనించబడింది.రక్తదానం చేసే చాలా మంది వ్యక్తులు వారి వ్యాధుల నుండి త్వరగా కోలుకుంటారు,మరియు ఎక్కువ కాలం జీవించగలుగుతారు,ఇది బరువు తగ్గడానికి,ఆరోగ్యకరమైన కాలేయం మరియు ఐరన్ స్థాయిని నిర్వహించడానికి,గుండెపోటు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ,హాస్పిటల్ సూపింటెండెంట్ డా .కమల , డాక్టర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.