తెలంగాణ వీణ/ఓయూ: ఉస్మానియ యూనివర్సిటీ విద్యార్థులకు హెల్త్ కార్డులు ఇచ్చి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రైవేటు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలి..ఉస్మానియ యూనివర్సిటీ విద్యార్థులకు ఆర్టీసీ హాస్పటల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలి..యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స కోసం బెడ్ సదుపాయాలు కల్పించాలి.. హెల్త్ సెంటర్ లో కన్సల్టెంట్ డాక్టర్స్ యొక్క ఫోన్ నంబర్ల మరియు వాళ్ళు అందుబాటులో ఉండే సమయాలు విద్యార్థులకు తెలిసేలా నోటీసు బోర్డులో పొందపర్చాలి.
హెల్త్ సెంటర్ లో చేసే టెస్టుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి.
నాణ్యమైన మెడిసిన్ విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఎల్లవేళలా ఒక డాక్టర్ ఆత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కర్యాసమితి సభ్యులు అలివేలి రాజు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెలిమెల దృహన్ ,విద్యార్థి నాయకులు లింగా,రాజశేఖర్, జైవీర్,నవీన్ లు పాల్గొన్నారు