తెలంగాణ వీణ,శామీర్ పేట : ప్రజా సమస్య పరిష్కారం తోపాటు అన్నిరంగాల్లో గ్రామాలను అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దదం లక్షంగా పని చేస్తున్నానని ఎంపీపీ ఎల్లుభాయి బాబు అన్నారు. శామీర్ పెట్ గ్రామంలో గురువారం రూ. 8 లక్షల ముప్పై వేల రూపాయల నిధులతో సి సి రోడ్డు , డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్తేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాల మరమ్మత్తులు, అంగన్వాడీ కేంద్రంమరమ్మత్తులకు కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాయిబాబా, మండల్ కోప్షన్ సభ్యుడు ముజీబుద్దీన్, ప్రత్తేక అధికారి విజయ లక్ష్మీ, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య, డైరెక్టర్ భూమి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, మాజీ వార్డ్ సభ్యులు ఉప్పలయ్య, జ్యోతి, సరిత, నిర్మల, శేఖర్, బాబు, డేవిడ్, రవి, శ్రీనివాస్, చిన్న బాబు, సాయి, పెద్దబాబు, రమేష్, కృష్ణ, టీచర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.