తెలంగాణ వీణ..భారతదేశం:ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. పొట్టి ప్రపంచకప్‌లోనూ తన జోరును కొనసాగిస్తాడు అనుకుంటే అనూహ్యంగా విఫలం అవుతున్నాడు. మూడు మ్యాచుల్లో వరుసగా 1, 4, 0 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో కోహ్లి పై విమర్శల వర్షం మొదలైంది. అమెరికాలోని పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయాల్లో ఒత్తిడి లోనై అతడు వికెట్‌ను ఈజీగా ఇచ్చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓపెనర్‌గా అతడికి కలిసిరావడం లేదని, అతడికి అచ్చొచ్చిన వన్‌డౌన్‌లోనే బరిలోకి దిగాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.