తెలంగాణ వీణ, శామీర్ పేట్: శామీర్ పేట్ లోని లియోనియ రిసార్ట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఉత్పత్తి నీ మార్కెట్ లో విడుదల చేశారు. లో నర్మదా బయోకెమ్ లిమిటెడ్ డైరెక్టర్ హిమాలయ్ పటేల్ భూమండల్ ఈ సమావేశానికి మునార ఆగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సీఎస్ఆర్ నాయుడు సభకు అధ్యక్షతన వహించారు. ఈ సందర్బంగా సీఈఓ సీఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ మునారా వారి ఎన్ టెక్, ఈ ప్రత్యేక ఎరువు భారతీయ రైతుల కోసం స్విట్జర్ ల్యాండ్నుంచి దిగుమతి చేసుకోబడిందన్నారు. ఇది నత్రజని, సల్ఫర్ కలిగిన ఎరువు అని తెలిపారు. ఈ ఎరువులో డీఎంపీపీ అనే సాంకేతికత ఉండడం వలన నెలలో నత్రజని 45 నుంచి 75 రోజుల వరకు పంటకు అందిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మునారా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఎరువులను అందిస్తుంది. రసాయన ఎరువులు వాడిననాటి నుండీ మట్టిలో ఆర్గానిక్ పడిపోయిందన్నారు. మట్టిలో రసాయనాలు పెరిగి రైతులు పండించిన పంట దిగుబడి తగ్గుతుందన్నారు. పంట పండించే రైతులు భూమిని పాడు కాకుండా కాపాడుకోవాలన్నారు. రైతులు పోటీ పడి ఎరువులు వాడి తమ భూములను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. యూరియాను రైతులు తమ పంటలకు వాడడం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్మదా బయోకెమ్ లిమిటెడ్ డైరెక్టర్ హిమాలయ్ పటేల్, డైరెక్టర్ జెఎన్ఎ మూర్తి, బిజినస్ హెడ్ రపూల్, భారీ సంఖ్యలో డీలర్లు పాల్గొన్నారు.