తెలంగాణ వీణ/ఓయూ: ఆర్ట్స్ కళాశాల పెయింటింగ్, మరమ్మత్తులకు హెచ్ఎండిఏ నుంచి నిధుల మంజూరు- కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు తో పాటు ఎస్ బి ఐ ముందు నూతనంగా లాన్ మెయిన్ లైబ్రరీ సమీపంలో 500 మంది విద్యార్థులకు సరిపడే నూతన రీడింగ్ భవనం ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 12 ( ఆర్ట్స్ కళాశాల): రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్- ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ చాన్సులర్ దాన కిషోర్ బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలోని లైబ్రరీ తో పాటు తరగతి గదులను, సెమినార్ హాల్స్ , గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తులోని పలు గదులను పరిశీలించారు. అలాగే తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన సంభాషించారు. ఇంచార్జ్ వైస్ చాన్సులర్ దాన కిషోర్ తో పాటు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి .లక్ష్మీనారాయణ, ఓ ఎస్ డి టు విసి ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భీనవేని రామ్ షెఫర్డ్, ఓయూ చీఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ రాధిక తో పాటు హెచ్ఎండిఏ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ వైస్ చాన్సులర్ దాన కిషోర్ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో కలర్స్ , పెయింటింగ్ వేయడానికి అలాగే మరమ్మత్తులు చేయడానికి తగిన నిధులు హెచ్ఎండిఏ నుంచి విడుదల చేస్తామని తెలిపారు. ఇందుకు తగిన అంచనాలను వెంటనే రూపొందించాలని ఓయూ చీఫ్ ఇంజనీర్ తో పాటు హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎస్బిఐ ముందు భాగంలో నూతనంగా లాన్ డెవలప్మెంట్ చేయాలని ఆయన అధికారులను కోరారు. అలాగే మెయిన్ లైబ్రరీ సమీపంలోనే 500 మంది విద్యార్థుల కెపాసిటీతో ఒక రీడింగ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని వీసీ అధికారులను కోరారు. వీటన్నింటికీ అవసరమైన నిధులను హెచ్ఎండిఏ నుంచే విడుదల చేస్తామని దాన కిషోర్ తెలిపారు. థాయిలాండ్ యూనివర్సిటీలకు ఓయూ నుంచి ఆరుగురు పీహెచ్డీ విద్యార్థుల ఎంపిక స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా థాయిలాండ్ విశ్వవిద్యాలయాల్లో ఓయూ పరిశోధక విద్యార్థులు వెళ్లడానికి హెచ్ఎండి ఏ నుంచి ఫెలోషిప్ సహకారాన్ని అందిస్తున్నట్లు ఓయూ ఇంచార్జ్ విసి దాన కిషోర్ తెలిపారు. ఓయు కు సంబంధించిన వివిధ ఫ్యాకల్టీ ల నుంచి పీహెచ్డీ విద్యార్థులను ఎంపిక చేయాలని కోరారు.