Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

TG TET 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : TG TET 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలు https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. TG TET 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలు https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా 57,725 మంది అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా 51,443 మంది అర్హత పొందారు. ఈ క్రమంలో పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% కాగా, పేపర్-2లో 34.18% మంది అర్హత దక్కించుకున్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది.టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. తెలంగాణలో జూన్‌ 2వ తేదీతో TG TET 2024 పరీక్షలు ముగిశాయి. మే 20వ తేదీన ప్రారంభమైన ఈ TG TET 2024 పరీక్షలు 10 రోజుల పాటు జరిగాయి. పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడగా.. పేపర్‌-1కి 99,958 మంది.. పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you