- ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం
- మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని
- మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లిన చంద్రబాబు
తెలంగాణ వీణ.. ఆంధ్ర:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయ్ లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది.