తెలంగాణ వీణ..ఆంధ్ర:మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవితోపాటు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు భారీ ఎత్తున ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులలో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు బయలుదేరారు. అలాగే తండ్రి కోసం అకీరా నందన్, ఆద్య కూడా గన్నవరం వచ్చేశారు.