తెలంగాణ వీణ..భారతదేశం:సీనియర్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించారు. ఇక ఈ మధ్య లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య సర్జా కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎప్పటినుంచో ఐశ్వర్య.. కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమను ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించగా త్వరలోనే వివాహం జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక గత ఏడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం ఉమాపతి కూడా హీరోగా కొనసాగుతున్నాడు