- అంతకుముందు, గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి
- కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించిన నేతలు
తెలంగాణ వీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే కూటమి నేతలను గవర్నర్ ఆహ్వానించారు. అంతకుముందు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్లమనోహర్‌లు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ… కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు.విజయవాడలో ఎన్డీయే శాసన సభపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభా పక్ష నేతగా కూటమి ఎమ్మెల్యేలు… చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.