- నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
- రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం
- ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కొత్త ఎంపీలకు నడ్డా విందు
- ఆకట్టుకునే వంటకాలతో విందు
తెలంగాణ వీణ..ఢిల్లీ:ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది. ఈ వేసవిలో అధిక వేడిమిని దృష్టిలో ఉంచుకుని, ఈ విందులో ఐదు రకాల ఫ్రూట్ జ్యూస్ లు, వివిధ ఫ్లేవర్లలో షేక్ లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతా అందించనున్నారు. అంతేకాదు, జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడ్డించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. తృణధాన్యాలను (మిల్లెట్స్) ఇష్టపడే వారి కోసం బజ్రా కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిజర్ట్ లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్… స్పెషల్ టీ, కాఫీ అందుబాటులో ఉంచుతున్నారు.