- తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందన్న కిషన్ రెడ్డి
- మొదటి నుంచి పార్టీ కోసం పని చేశామని… సిద్ధాంతమే ఊపిరిగా ఉన్నామని వ్యాఖ్య
- తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామన్న కిషన్ రెడ్డి
తెలంగాణ వీణ..తెలంగాణ:సాధారణ కార్యకర్తలకు కూడా కేంద్రమంత్రి పదవులు రావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం… తమ గెలుపు కోసం పని చేశారన్నారు.లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా అయిన తాను, బండి సంజయ్, శ్రీనివాసవర్మలం మొదటి నుంచి పార్టీ కోసం పని చేశామని… సిద్ధాంతమే ఊపిరిగా పని బతికామన్నారు. సాధారణ కార్యకర్తలకు కేంద్రమంత్రి పదవులు రావడం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ మంచి అవకాశం ఇచ్చింది: శ్రీనివాసవర్మ
పార్టీ తనకు మంచి అవకాశమిచ్చిందని శ్రీనివాస వర్మ అన్నారు. తన గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అహర్నిషలు పని చేశారని గుర్తు చేసుకున్నారు. తన విజయం కోసం పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా ఎలా పని చేయాలో మోదీ చెప్పారని తెలిపారు. తాను ఈస్థాయికి చేరుకోవడానికి కార్యకర్తలు కారణమన్నారు