తెలంగాణ వీణ : మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 128 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారుమధిర క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…అనంతరం మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసింది అధికారులు అభివృద్ధి పనుల వేగవంతం పెంచండి అని ఆదేశించారు. ఇది ప్రజా ప్రభుత్వం…. ప్రజలకు హామీలు ఇచ్చాం అధికారుల జవాబుదారీ తనంతో పనిచేయండని పేర్కొన్నారు. అనంతరం మధిర అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 128 కోట్లు మంజూరు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క