- ఐఆర్ సీటీసీ భారత్ గౌరవ్ ‘దివ్య దక్షిణ యాత్ర’
- ఈ నెల 22 న సికింద్రబాద్ నుంచి మొదలు కానున్న టూర్
- 8 రాత్రుళ్లు, 9 రోజులు సాగే ఈ టూర్ కు బుకింగ్స్ ఓపెన్
తెలంగాణ వీణ..భారతదేశం:దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది. ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీలో దక్షిణాదిన ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన భారత్ గౌరవ్ రైళ్లలో తాజా యాత్రను చేపట్టింది.
సందర్శించే ఆలయాలు ఇవే..
అరుణాచలం, రామేశ్వరం, మధురై మీనాక్షి ఆలయం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం.. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కోవలం బీచ్.ట్రైన్ బయలుదేరేది ఇక్కడి నుంచే..
ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ, గూడురు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు.
షెడ్యూల్ (మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు)..
మొదటి రోజు: సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది.
రెండో రోజు: ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. అరుణాచల ఆలయ సందర్శన.
మూడో రోజు: ఉదయం 6.30 గంటలకు కుదల్‌నగర్ చేరుకుని అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం సందర్శన. రాత్రి అక్కడే హోటల్ లో బస.
నాలుగో రోజు: మధ్యాహ్న భోజనం తర్వాత మధురై మీనాక్షి ఆలయ సందర్శన.. సాయంత్రం కన్యాకుమారికి పయనం.
ఐదో రోజు: కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయాన్ని చూడొచ్చు.
ఆరో రోజు: ఉదయం తిరువనంతపురం పయనం. అనంత పద్మనాభస్వామిని దర్శనం తర్వాత కోవలం బీచ్ టూర్. సాయంత్రం తిరుచిరాపల్లి పయనం.
ఏడో రోజు: ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శనం తర్వాత మధ్యాహ్నం తంజావూర్ చేరుకొని బృహదీశ్వర ఆలయ సందర్శన
ఎనిమిదో రోజు: తంజావూర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరుతారు.
తొమ్మిదో రోజు: ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
ఛార్జీలు ఇలా..
ఎకానమీలో పెద్దలకు రూ. 14,250.. 5-11 ఏళ్ల పిల్లలకు రూ.13,250
స్టాండర్డ్‌లో పెద్దలకు రూ.21,900.. 5-11 పిల్లలకు రూ.20,700
కంఫర్ట్‌లో పెద్దలకు రూ.28,450.. 5-11 ఏళ్ల పిల్లలకు రూ.27,010