తెలంగాణ వీణ..భారతదేశం:న్యూ ఢిల్లీ :జూన్ 09
దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోడీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జీ7 సమావేశాలకు రావా ల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోడీ ఓకే అన్నట్లు తెలిసింది..తనను ఆహ్వానించినం దుకు మెలోనికి మోడీ కృతజ్ఞతలు చెప్పారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.