- రామోజీరావు అస్తమయం
- సినీ, మీడియా, టీవీ రంగాల్లో విషాదం
- రామోజీ మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎంపీ ఉండవల్లి
తెలంగాణ వీణా తెలంగాణ:ఈనాడు అధిపతి రామోజీరావు మరణం పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రామోజీ మృతికి సంతాపం తెలియజేస్తున్నట్టు ఉండవల్లి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామోజీరావు దేశవ్యాప్తంగా పేరుగాంచారని కొనియాడారు. ఏ రంగంలో ప్రవేశించినా సెలెబ్రిటీ స్థాయికి ఎదిగారని కీర్తించారు. రామోజీరావును కలవాలని చాలాసార్లు ప్రయత్నించానని, కానీ కలవలేకపోయానని ఉండవల్లి విచారం వ్యక్తం చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక… అప్పటి రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనాడు గ్రూప్ సంస్థ మార్గదర్శిపై తీవ్ర ఆరోపణలు చేయడం, కోర్టులో పిటిషన్ లు వేయడం తెలిసిందే.