- డల్లాస్ వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్
- 2 వికెట్లతో తేడాతో లంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్
- ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక
- ఇప్పుడు రెండో ఓటమితో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం
తెలంగాణ వీణ ..ప్రపంచం:టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకకు ఘెర పరాభవం ఎదురైంది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక 47 రన్స్‌తో రాణించగా, ధనుంజయ 21, డిసిల్వా 19 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, రిషద్ హుస్సేన్ చెరో 3 వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు కళ్లెం వేశారు.
అనంతరం 125 పరుగుల స్వల్ప ఛేదనతో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హృదోయ్ 40, లిటర్ దాస్ 36 బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 4, హసరంగ 2 వికెట్లు తీశారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే తన తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ పరాజయంతో రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది