తెలంగాణవీణ, హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో గత రెండు మూడు రోజుల నుండి సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఇకపోతే హైదరాబాద్ జంట నగరాలలో వాన దంచికొట్టనున్నట్లు వాతావవరణ శాఖ తెలిపింది. ఇక నేడు సాయంత్రం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక జూన్ 10 వరకు జంట నగరాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అలాగే జూన్ 11 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం.