తెలంగాణ వీణ,హైదరాబాద్:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్ల తండాలో పిడుగుపాటుతో గురువారం సాయంత్రం పశువుల కాపరి గెమ్లా మృతి చెందాడు.అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చెరేగడిలో గురువారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన గోపాల్ పిడుగు పడి అక్కడే చనిపోయారు.న్వాల్కల్ మండలం అత్నూ ర్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు పూర్తి దగ్ధమైంది..