Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రతిభ..

Must read

  • క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 118 స్థానంలో ఐఐటీ బాంబే
  • జాబితాలోని భారత విద్యా సంస్థల్లో ముందువరుసలో నిలిచిన వైనం
  • ఐఐటీ ఢిల్లీకి 197, ఐఐఎస్‌సీకి 211, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 222,  ఐఐటీ మద్రాస్‌కు 227వ ర్యాంకు 
  • తొలి స్థానంలో మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • ఆసియా దేశాల్లో మూడో స్థానంలో నిలిచిన భారత్, తొలి రెండు స్థానాల్లో జపాన్, చైనా

తెలంగాణ వీణ,హైదరాబాద్:గత దశాబ్ది కాలంలో భారత విద్యారంగ ప్రమాణాలు మెరుగవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో భారతీయ యూనివర్సిటీలు నానాటికీ మెరుగవుతుండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో- 2025లో తాజాగా ఐఐటీ బాంబే 31 స్థానాలు మెరుగుపడి 118వ ర్యాంకు దక్కించుకుంది. ఈ జాబితాలోని భారత విద్యాసంస్థలు అన్నిటికంటే మెరుగైన ర్యాంకు సాధించింది. ఇక గతేడాది 197వ ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఢిల్లీ ఈమారు 150 ర్యాంకుకు ఎగబాకింది. ఈ సందర్భంగా ప్రధాని ఐఐటీల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. పరిశోధన, సృజనాత్మకత పెంపొందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థ పాప్యులారిటీ, ఫాకల్టీ-స్టూడెంట్ల నిష్ఫత్తి, ఫ్యాకల్టీల కున్న సగటు సైటేషన్లు, అంతర్జాతీయ బోధనా సిబ్బంది నిష్ఫత్తి, అంర్జాతీయ విద్యార్థి నిష్పత్తి, రీసెర్చ్ నెట్వర్క్, ఉద్యోగావకాశాలు, సుస్థిరత తదితర అంశాల ఆధారంగా క్యూఎస్ వరల్డ్ ర్యాకింగ్స్ ను నిర్ణయిస్తారు.

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌.. ముఖ్యాంశాలు

  • అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ జాబితాలో వరుసగా 13వ ఏడాది తొలి స్థానంలో నిలిచింది. 
  • విద్యార్థుల ఉద్యోగార్హత పరంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో నిలిచింది. 
  • ఆసియాలో అత్యధిక యూనివర్సిటీ ర్యాంకులు పొందిన దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. జపాన్, చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 
  • ఈ జాబితాలో 61 శాతం భారత యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపడగా, 24 యూనివర్సిటీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మరో 9 శాతం యూనివర్సిటీల ర్యాంకులు తగ్గాయి. కొత్తగా మూడు భారత యూనివర్సిటీలు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. 
  • 37 భారతీయ విద్యాసంస్థలు తమ పరిశోధన విభాగాల్లో అభివృద్ధి సాధించాయి. ఫాకల్టీల సైటేషన్స్‌ మెరుగయ్యాయి.
  • ఈ జాబితాలో ఐఐఎస్‌సీకి 211, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 222, ఐఐటీ మద్రాస్‌కు 227 ర్యాంకు దక్కాయి. 
  • 2018 మధ్య కాలంలో ఐఐటీ బాంబే 15,905 రీసెర్చ్ పేపర్లు ప్రచురితమయ్యాయి. 143,800 సైటేషన్లు దక్కాయి. జాతీయ, ప్రపంచస్థాయి సగటు కంటే అధికంగా ఐఐటీ బాంబే పరిశోధనల్లో 30 శాతం అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 
  • ఐఐటీ ఢిల్లీ కూడా పరిశోధనల్లో మెరుగయ్యింది. 2018-22 మధ్య కాలంలో ఐఐటీ ఢిల్లీ నుంచి 16,439 పేపర్లు ప్రచురితమయ్యాయి. అక్కడి ఫ్యాకల్టీలకు 221,496 సైటేషన్లు దక్కాయి. 
  • భారత విద్యా వ్యవస్థను ఆధునికీకరించడంలో జాతీయ విద్యా విధానం ఓ గొప్ప ముందడుగు అని క్యూఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెస్సికా టర్నర్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you