తెలంగాణవీణ,యాదాద్రి జిల్లా: బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో నివాసముంటున్న చిన్న మచ్చ సత్తయ్యగౌడ్ తన స్థలంలో నిర్మించుకున్న ఇంటి నిర్మాణాన్ని దౌర్జన్యంగా వచ్చి దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చివేసిన నిందితులను, బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తలించారు,పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.ప్యారారం గ్రామానికి చెందిన మచ్చ చిన్న సత్తయ్య గౌడ్, మచ్ఛ పెద్ద సత్తయ్య గౌడ్ వద్ధ అతనికి వచ్చే భాగం భూమి గ్రామ పెద్దలు,పట్టాదార్ సమక్షములో 1986 లో స్థలం కొనుగోలు చేసుకొని అట్టి స్థలం లో ఇల్లు కట్టుకొని, విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారు. మే 24 న దౌర్జన్యంగా మచ్చ అరవింద్ గౌడ్, హోటల్ మచ్చ పెద్ద సత్తయ్య గౌడ్, మచ్చ శేఖర్,గౌడ్, మచ్చ రమేష్ గౌడ్,,లు కలిసి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ ఇల్లును జేసీబీ తో కూల్చి వేశారని ఫీరియదు చేసారు, బాధితుడు మచ్చ చిన్న సత్తయ్య గౌడ్ ఫీరియదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురిలో ఇద్దరిని మచ్చ అరవింద్ గౌడ్, హోటల్ మచ్చ పెద్ద సత్తయ్య గౌడ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించమన్నారు,మిగతా ఇద్దరు నిందితులు శేఖర్ గౌడ్, రమేష్ గౌడ్ లను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు, అదేవిదంగా జేసీబీ ని సిజ్ చేసి డ్రైవర్ ని కూడా కోర్టు కి తలిస్తామని తెలిపారు, అక్రమాలకు పలుపడితే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని బొమ్మలరామారం ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి హేచ్చరించారు.