తెలంగాణవీణ, బొమ్మలరామారం ; యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో నివాసముంటున్న చిన్న సత్తయ్యగౌడ్ తన స్థలంలో నిర్మించుకున్న ఇంటి నిర్మాణాన్ని కొందరు దౌర్జన్యంగా శుక్రవారం వచ్చి దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. దీంతో సత్యయ్య బొమ్మల రామారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేకూర్చాలని కోరారు. వివరాల్లోకి వెళ్లితే చిన్న సత్తయ్య గౌడ్, మచ్ఛ పెద్దసత్తయ్య వద్ధ 1986 లో స్థలం కొనుగోలు చేసుకొని అట్టి స్థలం లో ఇల్లు కట్టుకున్నాడు, విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారు. అయితే శుక్రవారం దౌర్జన్యంగా హోటల్ సత్తయ్య, శేఖర్,రమేష్ అరవింద్, లు కలిసి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ ఇల్లును జేసీబీ తో కూల్చి వేశారు, చిన్న సత్యయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేశారు – చిన్న సత్యయ్యగౌడ్
ప్యారారం గ్రామంలో 1986 లో సర్వే నెంబర్ లో 8 గుంటల స్థలాన్ని మచ్చ పెద్ధ సత్తయ్య వద్ధ కొనుగొలు చేసి అందులోనే ఇంటినిర్మాణాన్ని చేపట్టి నివాసముంటున్నామని సత్తయ్యగౌడ్ తెలిపారు. అయితే కొందరు తన స్థలంలో నిర్మించిన ఇంటిని జేసీబీతో వచ్చి తనపై దాడి చేసి దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేశారన్నారు. ఇదే స్థలాన్ని బొమ్మలరామారం తహసిల్ధార్ భూమిని సర్వే చేసి హాద్ధులు గుర్తించి తాను నిర్మించుకున్న ఇంటిని పంచనామా చేసి ఇచ్చిందన్నారు. అయితే ఏళ్ల తరబడి ఇక్కడే నివాసముంటూ వ్యవసాయం చేసుకుంటున్న తనపై దాడి చేసి ఇంటిని నెలమట్టం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం చేయాలని సత్తయ్య డిమాండ్ చేశాడు.