270-300 మార్కులు సాధించిన విద్యార్థి మహత్…* సిబ్బందిని అభినందించిన డైరెక్టర్ వెంకట్ మురికి
తెలంగాణ వీణ, కాప్రా : శామీర్పేట, కార్పోరేట్లో వాడే పాతపద్దతుల కంటే ప్రత్యేకమైన భిన్నమైన విధానాల వల్లనే ఎక్సలెన్సియా ఆధిపత్యం కొనసాగిస్తుందని ఎక్సలెన్సియా సంస్థల డైరెక్టర్ వెంకట్ మురికి అన్నారు. జేఈఈ మేయిన్స్-2024లో తన ఆధిపత్యాన్ని మరోసారి ఎక్సలెన్సియా కళాశాల నిరిపించుకుందని ప్రెస్ మీట్ లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఎన్డీఏ విడుదల చేసిన కీ ప్రకారం ఎక్సలెన్సియా విద్యార్ధి మహత్ 270- 300లకు మార్కులు సాధించినట్లు ప్రకటించారు. కెమిస్ట్రీలో 100 పర్సెంటెజ్ సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారన్నారు. ఎక్సలెన్సియా విద్యార్థులు సాధించిన ఫలితాలు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు గర్వకారణం అన్నారు. కార్పోరేట్లో వాడే పాతపద్ధతులకంటే ప్రత్యేకమై, భిన్నమైన విధానాన్ని ఎక్సలెన్సియా కళాశాల, అధ్యాపక బృందం వ్యవహరించడం వలనే ఇంతటి విజయం సాధ్యమయ్యిందన్నారు. సీబీఎస్సీ ఫలితాల్లో ఎక్సలెన్సియా విద్యార్థులు సత్త చాటనున్నారని గర్వంగా చెప్పుకొచ్చారు. జేఈఈలో దాదాపు 50 శాతం మంది తమ విద్యార్థులు 200లకు ఫైగా మార్కులు సాధించి జయకేతనం ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఆపరేషన్స్ హెడ్ – మిస్టర్ ఈశ్వరన్ ఆర్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ – వెస్ట్ జోన్ మిస్టర్ జంషెడ్ సికింద్రాబాద్ జోన్ ఆపరేషన్స్ హెడ్ – సుధీర్ అకడమిక్ హెడ్ – జాన్ సెంటర్ హెడ్స్ శామీర్ పేట బాయ్స్ – రమేష్,సెంటర్‌హెడ్ శామీర్‌పేట బాలికలు – వెంకటేశ్వరులు,సీబీస్ – అకడమిక్ ఇంచార్జ్ ఏకనాథ్
అకడమిక్ కోఆర్డినేటర్ – రహీం,అనిల్ పాల్గొన్నారు.