తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బుధవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పావని రెడ్డికి పార్టీ కండువాలను కప్పి సిఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన నడుస్తుందని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలతో అన్ని పార్టీల దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లీందన్నారు. సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి ,అంజి రెడ్డి ,సీతారాం రెడ్డి పాల్గొన్నారు, కార్పొరేటర్ పావనిరెడ్డితో పాటు పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారిలో నాయకులు సుదర్శన్ రెడ్డి , వంజరి ప్రవీణ్ ,వెంకట్ రెడ్డి ,సురేందర్ చారి ,బల్ నర్సింహ ,కాశ్యపి రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,నాగేశ్వర్ రెడ్డి ,కృష్ణ రెడ్డి వెంకట్ రెడ్డి ,విజయేందర్ ,నర్సిములు ,కాంత రెడ్డి ,రాజు ,సాయి ,శ్రీనివాస్ ,కుందంపల్లి నర్సింహా ,గోవర్ధన్ ,రాజేంద్ర ప్రసాద్ ,సత్తి రెడ్డి ,రెడ్డిఅప్ప రెడ్డి ,సుధాకర్ ,సింగం రాజు ,మోహన్ ,రాకేష్ లు ఉన్నారు