తెలంగాణవీణ, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకోసమని.. స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. దీంతో స్పీకర్ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ కలిసి వెళ్లారు.అయితే సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ.. రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవక పోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అయితే.. రేపు మరోసారి స్పీకర్ ను కలిసి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు.ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాగా.. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ఆయన రాజకీయ గురువు పీజేఆర్ తనయ బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. అయితే దానం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో.. ఓడిపోయిన చోటే వెతుక్కోవాలని, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.